జూనియర్ పవన్ కళ్యాణ్...మనల్ని ఎవడ్రా ఆపేది
on Jul 10, 2025
.webp)
ఢీ సీజన్ 20 ఇది సర్ మా బ్రాండ్ షో ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ గా సాగింది. ఇందులో రీ-రిలీజ్ స్పెషల్ థీమ్ లో ఒక్కో కొరియోగ్రాఫర్ ఒక్కో మూవీలోని సాంగ్ ని రీ-రిలీజ్ చేస్తూ పెర్ఫార్మ్ చేశారు. ఇక భూమిక ఐతే గబ్బర్ సింగ్ సాంగ్ ని రీ-రిలీజ్ చేసింది. దాంతో జడ్జెస్ ఫిదా ఇపోయారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ అలా అచ్చంగా పవన్ కళ్యాణ్ లా నడుచుకుంటూ వచ్చి ఎంటర్టైన్ చేశారు. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్, ఆయన సిగ్నేచర్ స్టెప్స్ ని వేసి అలరించారు. అప్పుడు హోస్ట్ నందు ఆదిని ఒక విషయం అడిగాడు. "జూనియర్ పవర్ స్టార్ ని చూస్తేనే షేక్ వస్తోంది. ఆది పవర్ స్టార్ ని పర్సనల్ గా కలిసి ఎలా తట్టుకుంటారయ్యా మీరు ఆ చరిష్మాని" అని అడిగాడు.
"మాములుగా ఎప్పుడు ఎవరిని కలిసినా కానీ ఒక్కసారి ఎగ్జాయిట్మెంట్ ఉంటుంది. రెండో సారి నార్మల్ అనిపిస్తుంది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారినే ఎప్పుడు ఎన్ని సార్లు కలిసినా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. " అని చెప్పాడు. ఇక ఎన్నికల సమయంలో జబర్దస్త్ కమెడియన్ గా ఉన్న ఆది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ గెటప్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా తనకు ఢీ షోకి రావడం కొత్త ఎనర్జీని నాలో జెనెరేట్ అవుతూనే ఉంటుంది.. ఈ టైములో బాస్ చెప్పిన డైలాగ్ ఒకటి అంటూ "మిత్రమా అసలే చీకటి..రోడ్లంతా గతుకులు. చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ మంచి ఫోర్స్ తో డైలాగ్ చెప్పారు. ఢీ షో సీజన్ 20 లో విన్నర్ కొరియోగ్రాఫర్స్ అంతా వచ్చి పెర్ఫార్మ్ చేస్తున్నారు. అలాగే జడ్జెస్ గా విజయ్ బిన్నీ మాష్టర్, రెజీనా వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



